: బంద్ విజయవంతం చేయాలి: పరిశీలకులకు వైఎస్సార్సీపీ దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఈ నెల 29న చేపట్టిన బంద్ ను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో జరిగిన వైఎస్సార్సీపీ పరిశీలకుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ విధానాలను ఘాటుగా విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ ను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని పార్టీ పరిశీలకులకు సూచించింది.