: గోపీచంద్ పై సైనా సెటైర్లు... కోచింగ్ బెంగళూరులోనే బాగుందట!


భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీ చంద్, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మధ్య దూరం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. అందుకే కోచ్ పై పరోక్షంగా ఆమె సెటైర్లు వేసింది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లి కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న సైనా కోచింగ్ అక్కడే బాగుందని చెబుతోంది. హైదరాబాదులోనే ఉండి ఉంటే ర్యాంకింగ్ మరింత దిగజారేదని అభిప్రాయపడింది. బెంగళూరు వెళ్లిన తరువాత తన ఆటతీరు మెరుగుపడిందని పేర్కొంది. తన ఆటతీరులో సానుకూల అంశాలు పెరిగాయని తెలిపింది. తన కోచ్ విమల్ కుమార్ ఫైనల్స్ ఆడేటప్పుడు మైదానంలోనే ఉన్నారని సైనా పేర్కొంది. అది మరింత సానుకూల అంశమని పేర్కొంది. తప్పులు చేసేటప్పుడు కోచ్ హెచ్చరించే అవకాశం ఉందని, అది మ్యాచ్ గెలిచేందుకు దోహదపడుతుందని సైనా వెల్లడించింది. తన లక్ష్యం ఒలింపిక్స్ పతకమని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News