: ఉత్తర కాశ్మీర్ లోని సోపూర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్ర దాడి... కానిస్టేబుల్, పౌరుడు మృతి


జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర కాశ్మీర్ లోని సోపూర్ కు సమీపంలోని తుజ్జర్ గ్రామంలో మసీదుకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్, ఓ పౌరుడు మరణించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు మోటార్ బైక్ పై వచ్చి స్టేషన్ పై కాల్పులు జరిపారని చెప్పారు. ఆ సమయంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడని, మసీదు బయట వీల్ చైర్ లో ఉన్న ఓ వికలాంగ వ్యక్తిని కాల్చారని వివరించారు. ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా చనిపోయారన్నారు. చివరగా పారిపోయే ముందుగా కానిస్టేబుల్ నుంచి ఐఎన్ఎస్ఏఎస్ తుపాకీని ఉగ్రవాదులు తీసుకుని పారిపోయారన్నారు.

  • Loading...

More Telugu News