: ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల
కాశ్మీర్ లోని ఉధంపూర్ లో దాడులు జరిపి, పరారీలో ఉన్న ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్ఐఏ విడుదల చేసింది. పట్టించిన వారికి రూ.10 లక్షల రివార్డును కూడా ఇస్తామని తెలిపింది. ఆ ఉగ్రవాదులను పాకిస్థాన్ లోని పఖ్తుంఖ్వాకు చెందిన వారిగా గుర్తించారు. కొన్ని రోజుల కిందట నలుగురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించి ఉధంపూర్ లో దాడులు జరిపారు. వారిలో నోమన్ అనే ఉగ్రవాది చనిపోగా, నవేద్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. మరో ఇద్దరు జాగ్రమ్ అలియాస్ మహ్మద్ భాయ్, అబు ఓక్షా అనే ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. ఇప్పడు వారి వూహా చిత్రాలే విడుదలయ్యాయి.