: తెలంగాణ మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్ లకు చేదు అనుభవం


కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డిలకు రాష్ట్ర సరిహద్దుల్లో చేదు అనుభవం ఎదురైంది. వీరిని సరిహద్దుల్లో అడ్డుకున్న కర్ణాటక పోలీసులు, పర్యటనకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తమ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతించబోమని చెప్పారు. దీంతో ప్రజాప్రతినిధులు వారితో వాగ్వాదానికి దిగడం, వారి వెంట పెద్ద సంఖ్యలో తెరాస కార్యకర్తలు ఉండటంతో, ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాజెక్టులను పరిశీలించేందుకు తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ, వారు అక్కడే నిరసనకు దిగారు.

  • Loading...

More Telugu News