: బ్యాంకాక్ లో పేలుళ్ల సమయంలో జెనీలియా ఆ దగ్గరలోనే ఉందట!
బాలీవుడ్ కథానాయిక జెనీలియా దేశ్ ముఖ్ ప్రస్తుతం ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ కోసం బ్యాంకాక్ లో ఉంది. అయితే నిన్న (సోమవారం) అక్కడ పేలుళ్లు జరిగిన సమయంలో ఆ ప్రదేశానికి సమీపంలోని ఓ మాల్ లో ఆమె ఉందట. అయితే తాను బాగానే ఉన్నానని జెనీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లానని, ఒక్కసారిగా సైరన్ల మోతలు, మంటలు చూసి చాలా భయమేసిందని చెప్పింది. అంతమంది చనిపోవడం చాలా బాధాకరమంటోంది.