: జెల్లీబీన్, కిట్ క్యాట్, లాలీపాప్... తరువాత వచ్చేది ఇదే!


ఆండ్రాయిడ్ తదుపరి వర్షన్ గా త్వరలో విడుదల కానున్న సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కు పేరు పెట్టినట్టు గూగుల్ వెల్లడించింది. దీనికి 'మార్ష్ మాలో' అని నామకరణం చేసినట్టు తెలిపింది. కాగా, ఆండ్రాయిడ్ వర్షన్లలో 4.0కు ఐస్ క్రీం శాండ్ విచ్, 4.1కు జెల్లీబీన్, 4.4కు కిట్ క్యాట్, 5.0కు లాలీపాప్ అని గూగుల్ పేర్లు పెట్టిన సంగతి తెలిసింది. 'మార్ష్ మాలో' అంటే మన 'పాలబెండ్లు' అనమాట. పంచదారతో తయారు చేసే ఇవి తెల్లగా ఉండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఇవంటే అందరికీ ఇష్టమే. ప్రపంచవ్యాప్తంగా 'మార్ష్ మాలో'ను ఇష్టపడనివారు లేరు కాబట్టే ఈ పేరు ఎంచుకున్నామని గూగుల్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News