: ఆ గ్రామంపై చీమల యుద్ధం... లబోదిబోమంటున్న ప్రజలు


గ్రామం మీద పడి కోతులు దాడులు చేస్తున్నాయని, కుక్కల బెడద పెరిగిపోయిందని వచ్చే ఫిర్యాదుల గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఆ గ్రామంలో ఇటువంటి సమస్యలు లేవు. ఉన్నదల్లా చీమల సమస్య. ఒకటి, రెండు, వందలు, వేలు కాదు, లక్షల సంఖ్యలో చీమలు ఆ ఊరిపై నిత్యమూ యుద్ధం చేస్తుంటాయట. బయట నాలుగడుగులు వేస్తే ఓ చీమ కుట్టి పోతోందని, ఇళ్లల్లోని అన్ని ఆహార పదార్థాలనూ తినేస్తున్నాయని, ఈ చీమల దెబ్బతో తమకు వింత రోగాలు వస్తున్నాయని ఆ గ్రామ ప్రజలు గ్రీవెన్స్ సెల్ కు వచ్చి వాపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని గులివిందల పేటలో నెలకొన్న చీమల సమస్య అధికారులు సైతం విస్తుపోయేలా చేసింది. ప్రజల ఫిర్యాదునైతే స్వీకరించారుగానీ, వాటిని ఎలా తరిమికొట్టాలన్నది మాత్రం తెలియడం లేదట.

  • Loading...

More Telugu News