: మీరే న్యాయం చేయాలి... విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబుతో అభయగోల్డ్ బాధితులు
అభయగోల్డ్ మాయ మాటలతో సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్న బాధితులు కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కలిశారు. తమను ఆదుకోవాలని ఆయనను కోరారు. న్యాయం చేయకపోతే తమ జీవితాలు దుర్భరంగా మారడం ఖాయమని వేడుకున్నారు. నేటి ఉదయం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాధితులు చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అగ్రిగోల్డ్ తరహాలో తక్కువ సమయంలోనే అధిక వడ్డీలతో డబ్బును రెట్టింపు చేస్తామని పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించిన అభయగోల్డ్ నిన్న బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే.