: దుబాయ్ లో ఏ మంత్రముంది?...అంతా ఆకర్షితులవుతున్నారు?: మోదీ


దుబాయ్ 'లఘు' భారత దేశం మాత్రమే కాదని, లఘు విశ్వమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దుబాయ్ లోని క్రికెట్ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ, దుబాయ్ లో ఏ మంత్రముందని ప్రపంచం మొత్తం ఆకర్షితమవుతోందని అన్నారు. బాగా చల్లగా ఉండే దేశాల ప్రజలు సైతం సూర్యుడు భగభగ మండే ఈ దేశంలో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. దానికి కారణం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కష్టపడే తత్వతమే దుబాయ్ పట్ల ఆసక్తిని కలిగిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా దుబాయ్ లో స్థిరపడిన కేరళీయులను ఆకట్టుకునేందుకు కాసేపు మలయాళంలో మాట్లాడారు. ఈ సమయంలో సభికులు కేరింతలు కొట్టారు. భారత్ కు విపత్తు వచ్చిన ప్రతి సందర్భంలోనూ దుబాయ్ ఎన్నారైలు మేమున్నామంటూ ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News