: సెంట్రల్ బ్యాంకాక్ లో బాంబు పేలుడు...12 మంది మృతి
ధాయ్ లాండ్ రాజధాని సెంట్రల్ బ్యాంకాక్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రచప్రసాంగ్ వద్ద భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు ధాటికి 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానిక కాల మానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఎరవాన్ ఆలయం దగ్గర బాంబు పేలుడు సంభవించినట్టు ధాయ్ పోలీసులు వెల్లడించారు. బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రులతో రక్తమోడుతూ కనిపించిందని, సహాయక చర్యలు ప్రారంభించామని అక్కడి అధికారులు తెలిపారు.