: కొత్త భయంతో ఆందోళనలో పడ్డ షారూఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షాను చిత్ర విచిత్రమైన భయాలు వెంటాడుతున్నాయి. తన ఆందోళనలను ట్విట్టర్ ద్వారా షారూఖ్ వెల్లడించాడు. తనకు రాత్రి పూట నిద్రలో నడిచే అలవాటు ఉందని, అలాంటప్పుడు తన పిల్లలను చూస్తే...భలే బావుంటారని, చూడగానే తినబుద్దేసేంత ముద్దుగా ఉంటారని, కొంపదీసి వారిని తినేస్తానేమో అని ఆందోళనగా వుందని ట్వీట్ చేశాడు. 'జీవితాన్ని, ఆలోచనలని అదుపులో ఉంచుకోవాలి అని చెబుతుంటారు. ఇదంతా నాన్ సెన్స్ అనిపిస్తోంది. ఎందుకంటే, నిద్రలేచాక జుట్టే స్వాధీనంలో ఉండడం లేదు' అంటూ షారూఖ్ చమత్కరించాడు. షారూఖ్ ట్వీట్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.