: ప్రపంచ డ్యాన్స్ ఛాంపియన్స్ గా భారతీయ బృందం!


ప్రపంచ డ్యాన్స్ ఛాంపియన్స్ గా భారతీయులు నిలిచారు. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో జరిగిన ప్రపంచ డ్యాన్స్ ఛాంపియన్స్ పోటీల్లో అమెరికాలోని 14 దేశాల నుంచి వచ్చిన 34 టీములను తోసిరాజని భారతీయ బృందం ట్రోఫీ గెలుచుకోవడం విశేషం. పాశ్చాత్య మ్యూజిక్ కు భారతీయ డాన్స్ రీతులను సమకూర్చిన 'దేశీ హాపర్స్' బృందం ఈ విజయాన్ని సాధించింది. ముగ్గురు సభ్యులతో ప్రారంభమైన ఈ బృందం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డాన్సర్లతో నిండి ఉంది. 'భారత్ మాత కీ జై', 'గణపతి బప్పా మోరియా' అనే పాటలతో జాతీయ జెండా ప్రదర్శిస్తూ ఈ బృందం చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీంతో ఈ బృందం 'క్రౌడ్ ఫేవరేట్' ట్రోఫీని కూడా గెలుచుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News