: పోస్టు కార్డుల్లో పులి!
తమ ప్రయత్నం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాల్సిన అవసరం లేదుగానీ... పులి కనిపిస్తే చాలు వేటాడి చంపేయాలనే ఆలోచన పుట్టే వారిలో మార్పు తేగలిగినా.. పులుల సంరక్షణ పట్ల చిత్తశుద్ధితో ఉండాలని జనంలో ఆలోచన కలిగించినా.. చాలునని ఆ కుర్రాళ్లు ఉత్సాహ పడుతున్నారు. అందుకే పోస్టుకార్డులకు రంగులద్ది.. వాటిని ఓ పద్ధతిలో అమర్చి.. అత్యంత భారీ పులి చిత్తరువును రూపొందించారు.
పులుల సంరక్షణకు అందరూ కలసి కట్టుగా నడుం బిగించాల్సిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ఉద్దేశంతో కోయంబత్తూరు కుర్రాళ్లు.. ఈ ప్రయత్నం చేశారు. కోవై మాన్యపురం కంపోర్ట్ నేషనల్ స్కూలు విద్యార్థులు ఇందుకోసం 35 వేల పోస్టుకార్డులు ఉపయోగించారు. వీటిని క్రమపద్ధతిలో పేర్చి పులి రూపం ఆవిష్కరించారు.