: కూలిన ఇండోనేషియా విమానంలో 6.5 బిలియన్ల డబ్బు


ఇండోనేషియాలోని పుపువా ప్రావిన్స్ లో కూలిన విమానంలో 6.5 బిలియన్ల ఇండోనేషియా రూపాయలు (4 లక్షల 70 వేల అమెరికన్ డాలర్లు) ఉన్నట్టు పోస్టాఫీస్ అధికార ప్రతినిధి అబు సోఫ్జాన్ వెల్లడించారు. ఐదుగురు సిబ్బంది సహా 54 మందితో కుప్పకూలిన ట్రిగానా ఏటీఆర్ 42-300 విమాన శకలాల వద్దకు చేరుకునేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ విమానంలో ప్రయాణిస్తున్నవారంతా ఇండోనేషియాకు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విమానంలోని నలుగురు ప్రయాణికులు పేద ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పేదలకు పంచేందుకు 6.5 బిలియన్ల ఇండోనేషియా రూపాయలు తీసుకెళ్తున్నారని అబు సోఫ్జాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News