: ఈ విషయాలు తెలుసుకుంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మీరే పట్టేయొచ్చు!


రోజుకో కొత్త రకం స్మార్ట్ ఫోన్ విడుదలవుతున్న ఈ తరుణంలో, కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారికి ఎన్నో అనుమానాలు, సందేహాలు వస్తుంటాయి. బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏది? దాన్ని ఎలా కనుగొనాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు మదిలో తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే మంచి ఫోన్ ను మీరే ఎంచుకోవచ్చు. కెమెరా: మెగా పిక్సల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ఫోటోలు వస్తాయని ఎప్పుడూ భావించవద్దు. పిక్సల్ ఫోటో క్వాలిటీ కన్నా, దాని పరిమాణాన్నే ప్రభావితం చేస్తాయి. చిన్న సైజులో ప్రింట్స్ చాలనుకునే వారికి మంచి లెన్స్ ఉన్న 4 ఎంపీ కెమెరా చాలు. కెమెరా సామర్థ్యం మేరకు చిప్ సెట్ ఉండాలి. మంచి చిప్ సెట్ లేకుంటే, ఎంత ఎక్కువ పిక్సెల్స్ ఉన్నా ఉపయోగపడదు. ప్రాసెసర్ వేగం: నిన్న మొన్నటి వరకూ సింగల్ కోర్, డబుల్ కోర్ ప్రాసెసర్లు రాగా, ఇప్పుడు ఒకేసారి క్వాడ్ కోర్ నుంచి ఆక్టా కోర్ వరకూ ప్రాసెసర్లతో ఫోన్లు వస్తున్నాయి. సింగల్ కోర్ లో ఒక టాస్క్ ఓపెన్ చేసిన తరువాత మరో టాస్క్ ఓపెన్ చేయాల్సి వుంటుంది. అదే ఆక్టా కోర్ లో ఏకంగా 8 టాస్క్ లు ఒకేసారి ప్రారంభించుకోవచ్చు. అయితే, ఈ స్థాయి వినియోగానికి సరిపడా ర్యాం కూడా ఉండాలి. సాధారణంగా యూజర్లు నాలుగు కోర్లకు మించిన టాస్క్ లు ఒకేసారి వాడరు. దీనికోసం ప్రాసెసర్ వేగం 2 గిగా హెర్జ్ పైన ఉంటే మేలు. అంటే 2 జీబీ 667 ఎంహెచ్ ర్యాంతో పోలిస్తే, 1జీబీ ర్యామ్ 1000 ఎంహెచ్ ర్యాం వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ: స్మార్ట్ ఫోన్లలో మరో ముఖ్యాంశం బ్యాటరీ ఇచ్చే లైఫ్. స్మార్ట్ ఫోన్లను రోజుకు రెండుసార్లు చార్జింగ్ పెట్టాల్సి వస్తోందన్నది అందరి నుంచి వస్తున్న ఫిర్యాదు. ప్రస్తుతం ఫోన్లలో 2000 ఎంఏహెచ్ నుంచి 5000 ఎంఎహెచ్ వరకూ బ్యాటరీలు వస్తున్నాయి. ఇవి ఎంత సేపు ఫోన్ ను పనిచేసేలా ఉంచుతాయనేది, అది వాడకంపై ఆధారపడి ఉంటుంది. డేటా వాడకమూ ప్రభావితం చూపుతుంది. 2జి వాడితే 10 గంటలు పనిచేసే ఫోన్, 4 జీ వాడితే, 4 గంటల్లోనే పడుకుంటుంది. దీంతో పాటు ఫీచర్లు, వివిధ యాప్స్, డేటా కనెక్షన్ వంటివి కూడా బ్యాటరీ లైఫ్ పై ప్రభావం చూపుతాయి. మీ వాడకం ఎలా ఉంటుందన్న విషయంపై కాస్తంత అవగాహన ఉంటే సరైన బ్యాటరీని ఎంచుకోవచ్చు. డిస్ ప్లే: స్మార్ట్ ఫోన్లో మరో ముఖ్యమైనది స్క్రీన్ సైజు. సాధారణంగా ఇప్పుడొస్తున్న ఫోన్లన్నింటిలో 4 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ సైజ కన్నా దాని రెజల్యూషన్ ముఖ్యం. రెజల్యూషన్ తక్కువగా ఉంటే హై డెఫినిషన్ వీడియోలు, చిత్రాలూ చూడటం కొంత కష్టం. బ్రౌజింగ్ సైతం సౌకర్యంగా ఉండదు. ఒక అంగుళానికి 300 మించిన పిక్సెల్స్ ఉంటే మంచిది. స్క్రీన్ టెక్నాలజీలో అమోలెడ్, సూపర్ అమోలెడ్ లు బాగుంటాయి. ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్ ఉంటే తక్కువగా బయాటరీ వినియోగమవుతుంది. కెపాసిటివ్ టచ్, గొరిల్లా గ్లాస్ అయితే, సులువుగా ఉండటంతో పాటు దీర్ఘకాలం మన్నుతుంది. మొత్తం మీద మంచి ఫోటోలు, సెల్ఫీలు కావాలంటే, కెమెరాను, గేమింగ్ అవసరాలకోసమైతే ప్రాసెసర్, యాప్స్ వాడకం, వేగంపై దృష్టిని నిలిపితే ర్యాం పరిణామం, గ్రాఫిక్స్, మల్టీ టాస్కింగ్ అవసరాలకైతే ప్రాసెసర్ వేగం, టాక్ టైం కావాలంటే బ్యాటరీ, వీడియోలు చూడాలంటే డిస్ ప్లే, ఫైల్స్, డేటా కోసం స్టోరేజ్ లను పరిశీలిస్తే, ఏ ఫోన్ మీకు సరిపోతుందో ఇట్టే తెలిసిపోతుంది.

  • Loading...

More Telugu News