: ఇంట్లో పనిమనిషిని పెట్టుకున్నారా? అయితే, నెలకు రూ. 9 వేలు ఇవ్వాల్సిందే!


పనిమనుషుల సామాజిక భద్రత కోసం జాతీయ స్థాయిలో సరికొత్త విధానాన్ని రూపొందించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఫుల్ టైం పనిమనుషులకు నెలకు రూ. 9 వేల వేతనం, దీనికి అదనంగా ఏడాదికి 15 రోజుల వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 'నేషనల్ హౌస్ మెయిడ్ పాలసీ' త్వరలోనే కేబినెట్ ముందుకు రానుంది. వయసు పెరిగిన తరువాత పనిమనుషులను యజమానులు తొలగిస్తే, వారికి తోడ్పాటునిచ్చేలా కొత్త విధానం ఉంటుంది. పనిమనుషులు సంఘాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఈ మేరకు ముసాయిదా ప్రతిపాదనలను కార్మిక సంక్షేమ విభాగం అధికారులు రూపొందించి, ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు సమర్పించారు. ఇది అమలైతే, పనిమనుషుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని కేంద్రం చెబుతోంది.

  • Loading...

More Telugu News