: ‘వ్యాపం’ ఎఫెక్ట్ బీజేపీపై శూన్యమే!... ఎంపీ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘కమలం’ క్లీన్ స్వీప్


మధ్యప్రదేశ్ లో పురుడుపోసుకుని దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘వ్యాపం’ కుంభకోణం ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీ ఇమేజీని ఇసుమంత కూడా తగ్గించలేకపోయింది. ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని పార్లమెంటులో అధికార బీజేపీపై విపక్షాలు దండెత్తాయి. సభను ఆద్యంతం అడ్డుకున్నాయి. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్షాలకు షాకిచ్చింది. మొత్తం 16 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే, అన్నింటిలోనూ ‘కమలం’ పార్టీ ఘన విజయం సాధించింది.

  • Loading...

More Telugu News