: కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ కు ఆందోళన వ్యక్తం చేశాం: బాసిత్
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై తమ ఆందోళనను వ్యక్తం చేసినట్టు భారత్ లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ తెలిపారు. ఢిల్లీలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనపై సమన్లు జారీ చేయడంతో స్పందించిన బాసిత్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనను తేల్చేందుకు సరైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్దారు. భారత సరిహద్దుల నుంచి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరుగుతున్నాయని బాసిత్ ఆరోపించారు. జూలై, ఆగస్టుల్లో భారత భద్రతా బలగాలు సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి 70 సార్లు కాల్పులు జరిపాయని ఆయన ఆరోపించారు. కాగా, గత మూడు రోజులుగా సరిహద్దుల వెంబడి పాక్ జరుపుతున్న కాల్పుల కారణంగా 9 మంది భారతీయులు గాయపడ్డారు.