: 34 ఏళ్ల తరువాత యూఏఈ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని
దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఓ భారత ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ బయలుదేరిన ఆయనకు అధికారులు, పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు. కాగా, యూఏఈతో పలు పెట్టుబడులు, వాణిజ్య పరమైన అంశాలను గురించి చర్చించనున్న మోదీ కొన్ని కీలక ఒప్పందాలపైనా సంతకాలు చేయనున్నారు. భారత్ కు చెందిన కార్మికులతో సమావేశమయ్యే ఆయన, నేటి సాయంత్రం అబూదాబీలోని ప్రముఖ మసీదు 'షేక్ జాయిద్'ను సందర్శించనున్నారు. రేపు మోదీ సౌదీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అన్ నహ్యాన్ తో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. 1981లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ యూఏఈని సందర్శించిన అనంతరం మరే ప్రధానీ ఆ దేశంలో పర్యటించలేదు.