: యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించిన 68 మంది భారతీయుల అరెస్ట్


సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన 68 మందిని సియాటెల్ లో అదుపులోకి తీసుకున్నట్టు ఐసీఈ (యూఎస్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్) విభాగం వెల్లడించింది. వీరిలో అత్యధికులు పంజాబ్ కు చెందిన వారని, గత నెల రోజుల వ్యవధిలోనే వీరిలో సగం మంది సరిహద్దుల వద్ద దొరికిపోయారని, నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ డైరెక్టర్ సత్నమ్ సింగ్ చహాల్ తెలిపారు. వీరందిరినీ కస్టడీలో ఉంచి ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. కాగా, మొత్తం 4.5 లక్షల మంది భారతీయులు యూఎస్ లో అక్రమంగా ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా పట్టుబడితే, వారిని దేశం నుంచి పంపడానికి నెలల తరబడి సమయం తీసుకుంటోందని, వీరిలో కొందరికి దేశంలో నివసించే సదుపాయమూ కల్పిస్తున్నారని చహాల్ వివరించారు.

  • Loading...

More Telugu News