: ప్రత్యేక హోదాపై కేంద్రం డైలమాలో ఉంది!: విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న విషయమై కేంద్రం డైలమాలో ఉందని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలా? లేక ప్యాకేజీ ప్రకటించాలా? అన్న విషయమై ఆలోచనలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. హోదా అన్న పేరు లేకపోయినా, ఒక్క రూపాయి నష్టం లేకుండా ప్యాకేజీలు ఇచ్చి భర్తీ చేస్తామని ఆయన అన్నారు. హోదా విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని, ఈలోగా ఎవరేం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని హరిబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈ విషయమై ప్రజల సెంటిమెంటు దెబ్బతినకుండా నిర్ణయాలుంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News