: సీఎంఆర్ కళాశాల విద్యార్థులతో అనుష్క సందడి


రాణి రుద్రమదేవి జీవితం ఆధారంగా నిర్మించిన 'రుద్రమదేవి' చిత్రం ప్రచార కార్యక్రమాలను యూనిట్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో ఉన్న సీఎంఆర్ కాలేజీ విద్యార్థులతో హీరోయిన్ అనుష్క సందడి చేశారు. వారితో ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు.

  • Loading...

More Telugu News