: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రమౌళికి యావజ్జీవ శిక్ష
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఉగ్గే చంద్రమౌళికి మధ్యప్రదేశ్ లోని బాల్ గఢ్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 1981లో జన్మించిన చంద్రమౌళి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన వాడు. అతి తక్కువ సమయంలోనే చంద్రమౌళి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. 2005లో మధ్యప్రదేశ్ మంత్రి హత్య కేసులో చంద్రమౌళి ప్రధాన నిందితుడు. ఈ క్రమంలోనే, అతని కోసం గాలింపు జరిపిన పోలీసులు... చివరకు అదే సంవత్సరం అతడిని మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన బాల్ గఢ్ కోర్టు చంద్రమౌళి చేసిన నేరాన్ని ధ్రువపరుస్తూ, అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.