: రాహుల్ ను ప్రధాని చేయడానికి మన పొట్ట కొట్టారు: చంద్రబాబు


2018 కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత ఏపీకి కష్టాలు పెరిగాయని... అయితే, ఎన్ని కష్టాలు ఉన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతామని చెప్పారు. కేవలం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకే... మన పొట్ట కొట్టారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై మండిపడ్డారు. ఈ రోజు పట్టిసీమను జాతికి అంకితం చేసిన అనంతరం, ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కష్టపడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. రైతులకు నీరు ఇస్తే, వారు బంగారం పండిస్తారని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రారంభమవుతోందని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో పట్టిసీమ పైప్ లైన్ ను ఆపరేట్ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News