: పట్టిసీమ పూర్తికాకుండానే జాతికి ఎలా అంకితం చేస్తారు?: చంద్రబాబుకు వైకాపా ప్రశ్న
కాసేపట్లో పట్టిసీమ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై వైకాపా నేత కొత్తపల్లి సుబ్బరాయుడు విమర్శలు గుప్పించారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికాకుండానే... జాతికి ఆ ప్రాజెక్టును ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబులో అభద్రతా భావం పెరుగుతోందని... అందువల్లే ఇలాంటి కార్యాచరణకు దిగారని అన్నారు. చంద్రబాబు పాలన తుగ్లక్ పాలనగా మారిందని ఎద్దేవా చేశారు.