: సంక్షేమ రంగంలో తెలంగాణనే టాప్: కేసీఆర్


సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సంక్షేమ రంగానికి బడ్జెట్ లో రూ. 28 వేల కోట్లను కేటాయించామని చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సత్ఫలితాలు సాధించిందని అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ కోసం రెండు విడతల్లో రూ. 8,500 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని ప్రచారం చేశారని... కానీ, ప్రస్తుతం అంతరాయం లేని విద్యుత్ అందిస్తుండటం ద్వారా అవన్నీ ఒట్టి మాటలే అని నిరూపించామని తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని కలకత్తా హైకోర్టు మెచ్చుకుందని చెప్పారు. మిషన్ కాకతీయతో తెలంగాణ పేరు మారుమోగుతోందని అన్నారు. తెలంగాణ వైభవానికి గోల్కొండ కోట నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని అన్నారు. అంతకు ముందు, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో అమర జవాన్లకు ఆయన నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News