: విశాఖ తీరంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా... ఆవిష్కరించిన చంద్రబాబు


భారత 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా విశాఖ తీరంలో రెపరెపలాడింది. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఆర్కే బీచ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కేబినెట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

  • Loading...

More Telugu News