: సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న సైనా
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన జోరు కొనసాగిస్తోంది. ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్ చేరడం ద్వారా సైనా పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ యిహాన్ వాంగ్ పై 21-15, 19-21, 21-19 తో విజయం సాధించింది. సైనా ఒకవేళ సెమీస్ లో ఓడినా కాంస్యం దక్కుతుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సైనా క్వార్టర్స్ దశ దాటడం ఇదే ప్రథమం. గతేడాది క్వార్టర్స్ తోనే సరిపెట్టుకుంది.