: ఆ సినిమాలో 'వీరూ' స్నేహితుడైతే...బయట మాత్రం మా 'అభిషేక్'!: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ సినీ చరిత్రలో 'షోలే' చిత్రం ఒక ప్రత్యేకం. ఆ సినిమా వచ్చి 40 ఏళ్లయిన సందర్భంగా బాలీవుడ్ లో దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా అనుభవాలు, అది సృష్టించిన రికార్డులను అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో 'జయ్' పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ సినిమా గురించి ధర్మేంద్ర, తాను ఎప్పుడూ చర్చించుకోమని అన్నారు. అయితే ఎవరైనా ఈ సినిమా గురించి చర్చించుకుంటే అప్పట్లోని తమ అనుభవాలను గుర్తు చేసుకుంటామని అమితాబ్ చెప్పారు. సినిమాలో తనకు ప్రాణమిత్రుడు 'వీరూ'(ధర్మేంద్ర) అయితే, నిజ జీవితంలో 'వీరూ' మాత్రం అభిషేక్ అని తెలిపారు. తన కుమారుడే తనకు మంచి స్నేహితుడని ఆయన స్పష్టం చేశారు.