: గోవా అసెంబ్లీలో 'బికినీ' యుద్ధం!
గోవాలో వేళ్లూనుకున్న 'బికినీ' సంస్కృతిపై అసెంబ్లీ వేదికగా అధికార బీజేపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. బికినీలు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సుదీన్ దావలికర్, టూరిజం మంత్రి దిలీప్ పరులేకర్ మధ్య విభేదాలు వచ్చాయి. టూరిజం మంత్రి బికినీలను సమర్థిస్తే, దావలికర్ వ్యతిరేకించారు. టూ పీస్ బికినీలు భారత సంస్కృతికి వ్యతిరేకమని, టూరిస్టులు బికినీలు ధరించి తిరగడాన్ని అంగీకరించేది లేదని దావలికర్ స్పష్టం చేశారు. ఓ టూరిజం మంత్రిగా రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే నిర్ణయాలు తీసుకోలేనని, బికినీలకు తాను వ్యతిరేకం కాదని, బీచ్ లు, స్విమ్మింగ్ పూల్స్ లో వాటిని ధరించవచ్చని దిలీప్ వివరించారు. అయితే, మార్కెట్లు, రహదారులపై మాత్రం ఈ దుస్తులను అనుమతించబోమని వెల్లడించిన ఆయన గోవా టూరిజానికి ప్రసిద్ధి అని, యూరప్ నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారని గుర్తు చేశారు.