: వెండితెరకు ఎక్కుతున్న రాధేమా కథ... హీరోయిన్ గా హాట్ బ్యూటీ మల్లిక!
వివాదాస్పద దేవత రాధేమా జీవిత కథతో ఓ చిత్రం రానుంది. బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో హీరోయిన్ గా హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ నటించనుందని తెలుస్తోంది. నేహా ధూపియా మరో ముఖ్యపాత్రలో నటిస్తుందని కూడా సమాచారం. నిత్యమూ భక్తుల సందడితో, ఖరీదైన ఖాషాయ వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అచ్చమైన దేవతలా కనిపించే రాధేమా, పొట్టి దుస్తులు వేసుకుని అల్ట్రా మోడరన్ యువతిలా ఫోజులిచ్చి ఇటీవల వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమెపై వరకట్న వేధింపుల కేసులు కూడా నమోదయ్యాయి. సిినిమాకు కావాల్సిన అన్ని రకాల మసాలాలూ ఆమె జీవితంలో ఉన్నాయని భావించిన మీదటే, రాధేమా కథను తెరకెక్కించే ప్రయత్నం మొదలైంది.