: ఉమా భారతిని పొరబాటున 'శ్రీమతి' అన్న స్పీకర్... తానింకా వివాహం చేసుకోలేదన్న మంత్రి


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున ఆహ్లాదకర సన్నివేశం చోటు చేసుకుంది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటన చేయాలని కేంద్ర మంత్రి ఉమా భారతిని కోరుతూ, పొరబాటుగా 'శ్రీమతి' అని స్పీకర్ సుమిత్రా మహాజన్ సంబోధించారు. అందుకు వెంటనే స్పందించిన ఉమా, తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని చెప్పారు. భవిష్యత్ లో కూడా ఆ అవకాశం లేదని, అక్కడ వేకెన్సీ బోర్డు కూడా లేదని చెప్పారు. దాంతో సభలో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు. తరువాత తన పొరపాటుకు స్పీకర్ సారీ చెప్పడంతో అక్కడితో ఆ విషయం ముగిసింది. మధ్యప్రదేశ్ కు చెందిన 56 ఏళ్ల ఉమాను 'సాధ్వి' అని పిలుస్తుంటారు.

  • Loading...

More Telugu News