: కాశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణం: అమిత్ షా


భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం నెహ్రూ వల్లే కాశ్మీర్ సమస్య ఉత్పన్నమైందని ఆయన మండిపడ్డారు. కాశ్మీర్ అంశాన్ని అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అప్పగించి ఉంటే... పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేదే ఉండేది కాదని... ఆర్టికల్ 360 ప్రస్తావనే వచ్చేది కాదని అన్నారు. ఆ అంశాన్ని పటేల్ కు ఇవ్వకుండా నెహ్రూ అతిపెద్ద చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. ప్రస్తుత కాశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణమని అన్నారు.

  • Loading...

More Telugu News