: తెలంగాణలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదవ పీఆర్సీ వర్తింపు
తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు కూడా పదవ పీఆర్సీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. త్వరలో జీవో కూడా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 370 ఆలయాల్లో పనిచేస్తున్న 2,365 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. దాంతో ప్రభుత్వంపై రూ.5 కోట్ల భారం పడనుంది.