: తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు... ఖరారైన షెడ్యూల్


తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధమైంది. ఈ మేరకు పంచాయతీ, నగర డివిజన్, అసెంబ్లీ సెగ్మెంట్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లు వేయనున్నారు. అందుకోసం ఈ నెల 22 నుంచి 25 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక లోక్ సభ సెగ్మెంట్లు, రాష్ట్ర స్థాయి కార్యవర్గానికి ఈ నెల 28న నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ జరుగుతుంది.

  • Loading...

More Telugu News