: హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణ, బీహార్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ
బీహార్, తెలంగాణ విద్యార్థుల మధ్య నెలకొన్న గొడవ చిలికిచిలికి గాలివానగా మారగా, ఒకళ్లపై ఒకళ్లు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ లో ఉన్న నోవా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించింది. విద్యార్థుల మధ్య గొడవలపై యాజమాన్యం నుంచి ఎటువంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కళాశాలలో బీహారుకు చెందిన విద్యార్థులు అధికంగా ఉండడంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని తెలుస్తోంది.