: అన్ని స్టార్టప్ కంపెనీలూ మంచివికావు... ఫిల్టర్ చేయనున్న ఐఐటీలు


మరో నాలుగు నెలల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఉద్యోగుల కోసం ఆశ్రయించే స్టార్టప్ కంపెనీలపై ఓ కన్నేయాలని దేశంలోని ఐఐటీలు నిర్ణయించాయి. విద్యార్థులను ఇంటర్వ్యూలు చేసేందుకు వచ్చే కంపెనీల లావాదేవీలు, బ్యాలెన్స్ షీట్లు, వార్షిక నివేదికలను పరిశీలించి వడపోయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలను అనుమతించే ముందు గడచిన మూడేళ్ల రికార్డులు పరిశీలించాలని నిర్ణయించినట్టు ఖరగ్ పూర్, కాన్పూర్, ముంబై ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు పరిశ్రమ నిపుణులు, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించాలని కూడా అనుకుంటున్నట్టు తెలిపాయి. నాణ్యతలేని స్టార్టప్ కంపెనీల్లో చేరితే విద్యార్థి భవిష్యత్తు దెబ్బతింటుందని, ఆ పరిస్థితి రాకుండా చూడటమే తమ ఉద్దేశమని ఓ ఐఐటీ ప్లేస్ మెంట్ కమిటీ మెంబర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News