: నాగార్జున వర్సిటీ ఇన్ చార్జి వీసీగా ఉదయలక్ష్మి బాధ్యతల స్వీకరణ


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ చార్జి వీసీగా ఉదయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ఆమెను నియమించింది. వర్సిటీలో ర్యాగింగ్, విద్యార్థి కుల సంఘాల పోరు నివారించడంలో ఇన్ చార్జి వీసీగా ఉన్న సాంబశివరావు విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను తప్పించి సాంకేతిక విద్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News