: మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేసిన బాంబే హైకోర్టు


నెస్లే ఇండియాకు చెందిన మ్యాగీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ సంస్థకు చెందిన నూడుల్స్ పై నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. అయితే మరోసారీ నూడుల్స్ నమూనాలపై పరీక్షలు నిర్వహించాలని షరతు విధిస్తూ ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ భద్రపరచిన నూడుల్స్ నమూనాలపై పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్ హానికరం అంటూ జూన్ లో ఆహార భద్రత నియంత్రణసంస్థ వీటిని నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో పలు దుకాణాల్లో అప్పటికే ఉన్న మ్యాగీ నూడుల్స్ స్టాక్ ను వెనక్కి పిలిపించారు. దాంతో నెస్లే బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News