: కోట్లు కుమ్మరించి, నచ్చిన ప్రాంతంలో ఫ్లాట్ కొన్న రోహిత్ శర్మ
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో రూ.30 కోట్లతో ఓ భారీ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్ లో 29వ ఫ్లోరులో ఈ ఫ్లాట్ ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఫ్లాట్ లో నాలుగు బెడ్ రూములు ఉన్నాయి. ఈ ప్రాంతం రోహిత్ ను బాగా ఆకర్షించిందట. ఇక్కడి నుంచి వాంఖెడే మైదానానికి వెళ్లేందుకు 20 నిమిషాలు పడుతుంది. అటు, విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇంచుమించు అంతే సమయం పడుతుంది. అన్నింటికంటే, ఈ ఫ్లాట్ సముద్ర తీర ప్రాంతంలో ఉండడం రోహిత్ ను కొనుగోలుకు పురిగొల్పింది. దీనిపై అహూజా కన్ స్ట్రక్షన్స్ ప్రతినిధి మాట్లాడుతూ... భారత క్రికెట్ ఐకాన్ తమ భవన సముదాయంలోని ప్రముఖుల్లో ఒకడవడం సంతోషదాయమకని పేర్కొన్నారు.