: రాహుల్... ఈసారి సెలవుపై వెళ్లినప్పుడు మీ కుటుంబ చరిత్ర చదువుకో!: సుష్మా


లోక్ సభలో ఇచ్చిన సమాధానంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చురకలంటించారు. తాను క్రిమినల్ చర్యలకు పాల్పడ్డానని రాహుల్ విమర్శించారని... ఎటువంటి క్రిమినల్ చర్యకు పాల్పడ్డానో ఆయన చెప్పగలరా? అని ప్రశ్నించారు. 15వేల మంది మరణానికి కారణమైన ఆండర్సన్ ను దేశం దాటించింది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం కాదా? అని అడిగారు. ఆయన్ను ప్రభుత్వ విమానంలో తీసుకురమ్మని అర్జున్ సింగ్ కు చెప్పింది రాజీవ్ గాంధీ కాదా? అని సుష్మ ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లు సభకు చాటుమాటుగా వస్తున్నారని రాహుల్ అన్నారని ప్రస్తావించిన సుష్మ, తాను సభకు డైరెక్టుగానే వస్తున్నానని స్పష్టం చేశారు. రాహుల్ అప్పుడప్పుడు సెలవు పెట్టి ఎక్కడికో వెళుతుంటారని, ఈసారి ఆయన సెలవు పెట్టినప్పుడు ఏకాంతంలో కుటుంబ చరిత్ర చదువుకోవాలని సుష్మ ఎద్దేవా చేశారు. 38 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, తన రాజకీయ జీవితం ఒక తపస్సులాంటిదని చెప్పారు.

  • Loading...

More Telugu News