: ఏపీ ఎక్స్ ప్రెస్ ఆగే స్టేషన్ల వివరాలు
ఉదయం 7:45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు న్యూఢిల్లీ చేరుకునే ఏపీ ఎక్స్ ప్రెస్ రాష్ట్రంలోని 8 స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన తరువాత దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడల్లో ఆగుతుంది. ఆపై తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్ లలో ఆగుతుంది. తదుపరి నాగపూర్ జంక్షన్, బలార్షా, చంద్రపూర్ పాండ్ జిర్మా, భోపాల్ జంక్షన్, ఝాన్సీ, ఇటార్సీ గ్వాలియర్, ఆగ్రాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో ఉదయం 6:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 6:45 గంటలకు విశాఖ చేరుతుంది.