: 'నేతాజీ ములాయం సింగ్ యాదవ్'... 'సమాజ్ వాదీ' చీఫ్ జీవితంపై సినిమా


సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ జీవితంలోని ఎత్తుపల్లాలను ఆధారంగా చేసుకుని ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పేరు 'నేతాజీ ములాయం సింగ్ యాదవ్'. ఈ చిత్రం బుధవారం సెట్స్ పైకి వెళ్లనుంది. ముహుర్తం షాట్ కు ములాయం సోదరుడు, సీనియర్ క్యాబినెట్ మంత్రి శివ్ పాల్ యాదవ్ విచ్చేస్తున్నారు. కాగా, ములాయం పాత్రను క్యారెక్టర్ నటుడు రఘువీర్ యాదవ్ పోషిస్తున్నారు. వివేక్ దీక్షిత్ దర్శకుడు. యూపీలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. ములాయం బాల్యం నుంచి రాజకీయాల వరకు ఈ సినిమాలో చూడొచ్చట.

  • Loading...

More Telugu News