: మేం ఉద్యోగాలిచ్చాం...మీరు 'శౌర్యచక్ర' పురస్కారం ఇవ్వండి: కాశ్మీర్ పోలీసులు
ఈ నెల 5న జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ దగ్గర్లోని సిమ్రోలి గ్రామంలో పాక్ ఉగ్రవాది నవేద్ ను సజీవంగా ప్రాణాలకు తెగించి పట్టుకున్న రాకేష్ కుమార్ శర్మ, బిక్రమ్ జీత్ లకు 'శౌర్య చక్ర' పురస్కారం ఇవ్వాలని జమ్మూకాశ్మీర్ పోలీసులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీరిద్దరికీ పోలీసు శాఖలో ఉద్యోగాలు ఖరారు చేస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. రాకేష్ కుమార్ శర్మను ఆపరేషనల్ గ్రౌండ్ కానిస్టేబుల్ గా నియమించగా, బిక్రమ్ జీత్ ను ఫాలోవర్ గా నియమించారు. క్వాలిఫికేషన్ విషయంలో బిక్రమ్ జీత్ కు మినహాయింపునివ్వాలని డీజీపీ కె. రాజేంద్ర కుమార్ ఆదేశించారు. రాకేష్ కుమార్, బిక్రం జీత్ లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని దేశం యావత్తూ కొనియాడిన సంగతి తెలిసిందే.