: హైదరాబాద్ బిజినెస్ మేన్ తో సానియా చెల్లెలి పెళ్లి ఫిక్సయింది!
ఇండియన్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లి ఫిక్సయింది. హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్ తో ఆమె వివాహం సెప్టెంబరు 16న జరగనున్నట్టు తెలిసింది. పెళ్లి విషయాన్ని సానియా సోదరి నిర్ధారించింది. కొంతకాలంగా ఆనమ్, అక్బర్ పలు కార్యక్రమాల్లో జంటగా కనిపిస్తున్నారు. కాగా, ఆనమ్ వివాహాన్ని ఘనంగా జరిపేందుకు సానియా కుటుంబం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆనమ్ తల్లితో కలిసి ముంబయిలో షాపింగ్ చేస్తోందట. హైదరాబాదీ డిజైనర్ మోనీ అగర్వాల్ ఖరీదైన వజ్రాల నగలను రూపొందిస్తుండగా, ముంబయికి చెందిన ప్రఖ్యాత డిజైనర్లు మనీశ్ మల్హోత్రా, అబూ సందీప్ వధువుకు దుస్తులను డిజైన్ చేస్తున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి.