: 3000 రూపాయలకే గూగుల్ స్మార్ట్ ఫోన్?
కేవలం 3000 రూపాయలకే 'గూగుల్ స్మార్ట్ ఫోన్' రూపొందించనుందా? అంటే అవుననే అంటున్నాయి గూగుల్ వర్గాలు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ 'లావా' కేవలం 50 డాలర్లకే స్మార్ట్ ఫోన్ ను విపణిలోకి ప్రవేశపెట్టిన నేపథ్యంలో గూగుల్ కూడా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో కేవలం 3000 రూపాయలకే స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందంటూ భారత్, ఆగ్నేయాసియాల గూగుల్ డైరెక్టర్ రాజన్ ఆనంద్ తెలిపారు. భారత్ లో తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్న ఆయన, అందుకు తగ్గ ప్రణాళికలు గూగుల్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.