: సుందర్ పిచాయ్ కు చంద్రబాబు, యాపిల్ సీఈఓ అభినందనలు
గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ నియమితులవడం పట్ల ఆయనకు పలువురి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ లు ట్విట్టర్ లో ఆయనకు అభినందనలు తెలిపారు. "గూగుల్ సీఈఓగా నియమితులైన సందర్భంగా సుందర్ పిచాయ్ కు అభినందనలు. మీకు బెస్ట్ విసెష్ కూడా. భారత్ గర్వించదగ్గ సమయం ఇది" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అటు టిమ్ కుక్, "నీకు ప్రమోషన్ లభించినందుకు కంగ్రాచ్యులేషన్స్ పిచాయ్" అంటూ ట్వీట్ చేశారు.