: సఫారీ ఆటగాళ్ల 'కడుపులో గడబిడ'కు కారణం అవేనా?


భారత్ లో ప్రస్తుతం ఇండియా-ఎ, దక్షిణాఫ్రికా-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ సందర్భంగా ఆదివారం ఆసీస్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సఫారీ జట్టులోని 10 మంది ఆటగాళ్లు కడుపులో గడబిడ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. దాంతో, ఓ భారత ఆటగాడు సఫారీ జట్టుకు ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. కాగా, శనివారం సాయంత్రం తిన్న బటర్ చికెన్ కానీ, పిజ్జాలు కానీ ఆ గడబిడకు కారణమని భావిస్తున్నారు. ఆటగాళ్ల గైర్హాజరీలో రిజర్వ్ బెంచ్ ను బరిలో దింపినా, మైదానంలో దిగిన తర్వాత కొందరు ఇబ్బందిపడ్డారు. ఓ దశలో ఆటగాళ్ల కొరత ఏర్పడింది. దాంతో, సఫారీ జట్టు వీడియో ఎనలిస్ట్ హెన్రికస్ కోర్ట్ జెన్, భారత్-ఎ ఆటగాడు మన్ దీప్ సింగ్ కూడా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. సఫారీ జట్టుకు ఆడేందుకు భారత ఆటగాడు మన్ దీప్ సింగ్ కు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రత్యేక అనుమతి మంజూరు చేశాడు. ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికా-ఎ జట్టు ఆటగాళ్లు కోలుకుని, మిగతా మ్యాచ్ లలో బరిలో దిగేందుకు వీలుగా బీసీసీఐ టోర్నీని రీ-షెడ్యూల్ చేసింది.

  • Loading...

More Telugu News