: కాంగ్రెస్ సమాధానం చెప్పాలి: అరుణ్ జైట్లీ
వస్తుసేవల పన్ను (జీఎస్ టీ) బిల్లుతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశానికి ప్రయోజనం కలిగించే జీఎస్ టీ బిల్లును కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అడ్డుకోవడం తగదని హితవు పలికారు. అంతటి ప్రయోజనకరమైన బిల్లుకు ఎందుకు మద్దతివ్వడం లేదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, లలిత్ గేట్ పై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజెలను, వ్యాపం కుంభకోణంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లను తక్షణం పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.